E-PAPER

ఓటుకు నోటు కేసు.. రేవంత్‌రెడ్డి, సండ్ర పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

ఓటుకు నోటు కేసు.. రేవంత్‌రెడ్డి, సండ్ర పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ…

ఏసీబీకి దర్యాప్తు పరిధి లేదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. ఎన్నికల వ్యవహారంగా పరిగణించాలని వాదన...

(శుభ తెలంగాణ, న్యూఢిల్లీ ప్రతినిధి: పి. రమేష్‌ కుమార్‌)

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ‘ఓటుకు నోటు’ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ధర్మాసనంలో జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహన్‌ కూడా ఉన్నారు.
ఏసీబీ పరిధిపై పిటిషనర్ల వాదనలు
తమపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తమ పిటిషన్లలో కోరారు. ఈ వ్యవహారం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని, దీనిపై ఏసీబీకి దర్యాప్తు చేసే అధికారం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
2015 నాటి చట్టాలనే పరిగణించాలని వాదన
2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలను వర్తింపజేయలేమని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు. అప్పట్లో అమల్లో ఉన్న చట్టం ప్రకారం లంచం ఇవ్వజూపడం నేరంగా పరిగణించలేమని, ఈ వ్యవహారాన్ని ఎన్నికల చట్టాల పరిధిలోనే చూడాలని ఆయన వాదించారు. (
తదుపరి విచారణకు వాయిదా
ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తదుపరి తేదీని కోర్టు రిజిస్ట్రీ ఖరారు చేయనుంది. ప్రస్తుత విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరఫు వాదనలు పూర్తిగా జరగాల్సి ఉంది.

Share ePaper Clip

Preparing image...

ఏసీబీకి దర్యాప్తు పరిధి లేదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. ఎన్నికల వ్యవహారంగా పరిగణించాలని వాదన…

(శుభ తెలంగాణ, న్యూఢిల్లీ ప్రతినిధి: పి. రమేష్‌ కుమార్‌)

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ‘ఓటుకు నోటు’ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ధర్మాసనంలో జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహన్‌ కూడా ఉన్నారు.

ఏసీబీ పరిధిపై పిటిషనర్ల వాదనలు

తమపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తమ పిటిషన్లలో కోరారు. ఈ వ్యవహారం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని, దీనిపై ఏసీబీకి దర్యాప్తు చేసే అధికారం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

2015 నాటి చట్టాలనే పరిగణించాలని వాదన

2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలను వర్తింపజేయలేమని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు. అప్పట్లో అమల్లో ఉన్న చట్టం ప్రకారం లంచం ఇవ్వజూపడం నేరంగా పరిగణించలేమని, ఈ వ్యవహారాన్ని ఎన్నికల చట్టాల పరిధిలోనే చూడాలని ఆయన వాదించారు. (

తదుపరి విచారణకు వాయిదా

ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. తదుపరి తేదీని కోర్టు రిజిస్ట్రీ ఖరారు చేయనుంది. ప్రస్తుత విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరఫు వాదనలు పూర్తిగా జరగాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్