E-PAPER

భక్తజన సందోహం మధ్య వైభవంగా సత్యసాయి రథోత్సవం…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

భక్తజన సందోహం మధ్య వైభవంగా సత్యసాయి రథోత్సవం…

శుభ తెలంగాణ | పుట్టపర్తి, నవంబరు 18 (ప్రతినిధి: ఎం. శ్రీనివాస్ రెడ్డి):
ఆధ్యాత్మిక శోభతో పుట్టపర్తి పులకింత.. వెండి రథంపై సత్యసాయి దర్శనం...
శ్రీసత్యసాయి 101వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి రథోత్సవం భక్తి పారవశ్యాన్ని నింపింది. బుధవారం జరిగిన ఈ వేడుకకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తి వీధులు కిక్కిరిసిపోయాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఉత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మండపంలో తొలుత సత్యసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,100 దంపతులు పాల్గొన్నారు. సత్యసాయి బంగారు విగ్రహంతో పాటు సీతారాములు, వేణుగోపాలస్వామి పల్లకికి వేదపండితులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.అనంతరం వేణుగోపాలస్వామి ఆలయం వద్ద సర్వాంగ సుందరంగా అలంకరించిన వెండి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రథాన్ని ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సత్యసాయి బంగారు విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య వెండి రథంపై ప్రతిష్ఠించారు.సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన ఈ వేడుకలో అడుగడుగునా సాయినామ స్మరణ ప్రతిధ్వనించింది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రశాంతి నిలయంలో నారాయణ సేవ ద్వారా అన్నప్రసాద వితరణ చేపట్టారు.

Share ePaper Clip

Preparing image...

శుభ తెలంగాణ | పుట్టపర్తి, నవంబరు 18 (ప్రతినిధి: ఎం. శ్రీనివాస్ రెడ్డి):

ఆధ్యాత్మిక శోభతో పుట్టపర్తి పులకింత.. వెండి రథంపై సత్యసాయి దర్శనం…

శ్రీసత్యసాయి 101వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి రథోత్సవం భక్తి పారవశ్యాన్ని నింపింది. బుధవారం జరిగిన ఈ వేడుకకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తి వీధులు కిక్కిరిసిపోయాయి. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఉత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మండపంలో తొలుత సత్యసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,100 దంపతులు పాల్గొన్నారు. సత్యసాయి బంగారు విగ్రహంతో పాటు సీతారాములు, వేణుగోపాలస్వామి పల్లకికి వేదపండితులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.అనంతరం వేణుగోపాలస్వామి ఆలయం వద్ద సర్వాంగ సుందరంగా అలంకరించిన వెండి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రథాన్ని ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సత్యసాయి బంగారు విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య వెండి రథంపై ప్రతిష్ఠించారు.సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన ఈ వేడుకలో అడుగడుగునా సాయినామ స్మరణ ప్రతిధ్వనించింది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రశాంతి నిలయంలో నారాయణ సేవ ద్వారా అన్నప్రసాద వితరణ చేపట్టారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :