E-PAPER

పెళ్లైన కూతురికీ కారుణ్య నియామకానికి అర్హత: హైకోర్టు కీలక తీర్పు…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

పెళ్లైన కూతురికీ కారుణ్య నియామకానికి అర్హత: హైకోర్టు కీలక తీర్పు…

(శుభ తెలంగాణ | హైదరాబాద్ రిపోర్టర్: కె. నరేష్ యాదవ్)
ఒంటరి మహిళ అయి ఉండాలనే నిబంధన సరికాదు
హైదరాబాద్: వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఒంటరి మహిళ మాత్రమే కారుణ్య నియామకానికి అర్హురాలని పేర్కొంటూ నియామకాన్ని నిరాకరించడం సరికాదని అభిప్రాయపడింది. అర్హతలను పరిశీలించి సంబంధిత కుమార్తెకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.వివరాల్లోకి వెళితే.. ఎస్‌పీడీసీఎల్‌లో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి మరణించారు. ఆయన కుమారుడు లండన్‌లో చదువుకుంటుండటంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం చేసేందుకు నిరాకరించారు. దీంతో తనకు ఉద్యోగం కల్పించాలని రామకృష్ణారెడ్డి కుమార్తె జ్యోతి దరఖాస్తు చేసుకున్నారు.అయితే, ఆమె వివాహిత కావడంతో ఎస్‌పీడీసీఎల్ అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో జ్యోతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వివాహమైందనే కారణంతో లేదా ఒంటరి మహిళ కాదనే కారణంతో మాత్రమే కారుణ్య నియామకాన్ని నిరాకరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఆమెకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.ఈ తీర్పు కారుణ్య నియామకాల విషయంలో వివాహిత మహిళల అర్హతకు సంబంధించిన అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :