E-PAPER

“ఏసీబీ వలలో కీసర సీఐ, ఎస్‌ఐ.. రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

“ఏసీబీ వలలో కీసర సీఐ, ఎస్‌ఐ.. రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు..

శుభ తెలంగాణ, మేడ్చల్–మల్కాజ్‌గిరి ప్రతినిధి ఎన్. ప్రవీణ్ కుమార్

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌ రెడ్డి చిక్కారు. పీడీఎస్‌ బియ్యం కేసులో నిందితుడికి బెయిల్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టి ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు సమాచారం.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పది క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యానికి సంబంధించిన కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఇన్‌స్పెక్టర్‌ రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం రూ.8.50 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 2న బాధితుడి నుంచి రూ.3.50 లక్షలు తీసుకున్నట్లు, మిగిలిన రూ.5 లక్షలను సెప్టెంబర్‌ 17 అర్ధరాత్రి కీసర పెద్దమ్మ చెరువు సమీపంలో కారులో ఎస్‌ఐ జ్ఞానేందర్‌ రెడ్డి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.

ఏసీబీ అధికారులు దాడి చేస్తున్న సమయంలో ఎస్‌ఐ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అనంతరం అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీఐ ఆంజనేయులుపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
కెమికల్‌ పరీక్షలకు సహకరించలేదన్న ఏసీబీ
లంచం స్వీకరణను నిర్ధారించేందుకు నిర్వహించే కెమికల్‌ పరీక్షలకు సీఐ, ఎస్‌ఐ సహకరించకుండా అధికారులకు ఇబ్బందులు కలిగించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతో లంచం స్వీకరణకు సంబంధించిన పరీక్షలు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం జరిగినట్లు తెలిపారు.

బాధితుడి నుంచి లంచం డిమాండ్‌ చేయడంతో పాటు, అతడితో పలు పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు కూడా అధికారుల దర్యాప్తులో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్