E-PAPER

హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకూడదు.. అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు!

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకూడదు.. అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు!

శుభ తెలంగాణ | హైదరాబాద్‌ ప్రతినిధి: కే. నరేష్‌ యాదవ్‌
రిజర్వాయర్ల నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ
ఎస్టీపీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేయాలి
నిర్మాణాలు, పార్కులు, రోడ్ల శుభ్రతకు శుద్ధి చేసిన నీరే వినియోగించాలి
నవంబర్‌ 1 నుంచి కొత్త మార్గదర్శకాల అమలుకు చర్యలు
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర అవసరాలకు సరిపడా నీటి సరఫరా ఉండేలా రిజర్వాయర్లలో నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో నీటి అవసరాలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి శుద్ధి, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ఎస్టీపీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి
క్యూర్‌ పరిధిలో మంచినీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నిర్మాణం, శుద్ధి చేసిన నీటి వినియోగంపై ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో నీటి లభ్యతపై ఒత్తిడి పెరగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

క్యూర్‌ పరిధిలోని అన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలు వంద శాతం సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని వృథా చేయకుండా వివిధ అవసరాలకు వినియోగించే వ్యవస్థను మరింత విస్తరించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులకు ట్రీటెడ్‌ వాటర్‌
సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు వ్యవస్థతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సీఎం సూచించారు. పబ్లిక్‌ పార్కుల నిర్వహణ, రోడ్ల శుభ్రత వంటి పనులకు కూడా సాధ్యమైనంత వరకు ట్రీటెడ్‌ వాటర్‌నే ఉపయోగించాలని తెలిపారు.

భవన నిర్మాణాల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ సంస్థలు కూడా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, డేటా సెంటర్ల అవసరాలకు సైతం శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
నీటి నాణ్యతపై రాజీ వద్దు
ఎస్టీపీల్లో నీటి శుద్ధి ప్రక్రియ అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. శుద్ధి చేసిన నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వకూడదని స్పష్టం చేశారు. ప్రతి ప్లాంట్‌ వద్ద ప్రత్యేక అధికారిని నియమించి, కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అన్ని ఎస్టీపీలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించి వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఈ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను హైడ్రా సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ఎస్టీపీల నిర్వహణకు సౌర విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో అధికారులకు తెలిపారు.
గ్రీన్‌ ట్యాంకర్లకు ట్రాకింగ్‌ వ్యవస్థ
శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ట్యాంకర్ల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ట్రీటెడ్‌ వాటర్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ నీటిని పొందాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఎస్టీపీల నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగానికి సంబంధించి కొత్త ఆదేశాలు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
26 ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటి సరఫరా
ప్రస్తుతం 26 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి గ్రీన్‌ ట్యాంకర్ల ద్వారా ట్రీటెడ్‌ వాటర్‌ను సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు సమావేశంలో వివరించారు. వినియోగదారుల నుంచి కేవలం రవాణా ఖర్చులనే వసూలు చేస్తున్నామని, శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలో తాగునీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడటంతోపాటు, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని పెంచడం ద్వారా నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :