శుభ తెలంగాణ | హైదరాబాద్ ప్రతినిధి: కే. నరేష్ యాదవ్
శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ…..
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిసి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వానాన్ని అందజేశారు.
సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సదర్ ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌తో పాటు పలువురు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు










