E-PAPER

222వ వారానికి చేరిన జ్ఞానమాల కార్యక్రమం….

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

222వ వారానికి చేరిన జ్ఞానమాల కార్యక్రమం….

కాప్రా/ శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్. ప్రవీణ్ కుమార్: జ్ఞానమాల టీం తాడూరి గగన్ కుమార్ కార్యనిర్వహకు ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం 222వ వారానికి చేరుకుంది.ఈ సందర్భంగా కాప్రా మండలం జమ్మిగడ్డలోని బి.జె.ఆర్.కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్,బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్య,సామాజిక చైతన్యం, సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జ్ఞానమాల టీం సభ్యులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్వామి వివేకానంద చెప్పిన “ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే.. ప్రయత్నించి ఓడిపోవడం మేలు” అనే సందేశాన్ని గుర్తుచేశారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ నిరంతరం ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో జ్ఞానమాల టీం అడ్వైజర్ ఎస్.ఏ. రహీం, కోఆర్డినేటర్ నర్సింహ్మ చారి,సభ్యులు అనిల్ కుమార్,నాగేష్, నారాయణ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్