E-PAPER

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా రాఖీ వేడుకలు

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా రాఖీ వేడుకలు

పటాన్చెరు,(శుభ తెలంగాణ / ప్రతినిధి బీ.రవీందర్ ) ఆగస్టు 27.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–సోదరీమణుల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతను ప్రతిబింబించేలా ఒకరికొకరు రాఖీలు కట్టుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.రాఖీ పండుగ సందర్భంగా పాఠశాల తరఫున విద్యార్థులు మండల విద్యాశాఖ అధికారి పి.వి. నాగేశ్వర్ నాయక్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పోలీస్ శాఖకు చెందిన ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, వినోద్‌లకు కూడా విద్యార్థులు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. రాజేష్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు అందరూ కలిసిమెలిసి సోదర–సోదరీ భావంతో ఉండాలని సూచించారు. రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థులంతా ఐకమత్యంతో ఉంటూ మంచి విలువలను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్