E-PAPER

మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం  కార్యక్రమం..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం  కార్యక్రమం..

కాప్రా, ఆగస్టు 19 (శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్. ప్రవీణ్ కుమార్): తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని కాప్రా మండల కార్యాలయం ఎదుట ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రశాంత్ కార్తీ పీపుల్స్ ఫౌండేషన్ అధినేత ఆలకుంట్ల ప్రశాంత్ కార్తీ, శ్రీ సర్వాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలకుంట్ల ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి కొండా సురేఖకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానికులు, పేదలకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు.

కార్యక్రమంలో ప్రశాంత్ కార్తీ పీపుల్స్ ఫౌండేషన్ సభ్యులు ఉపేందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, మధు గౌడ్, నరేష్ రెడ్డి, శ్రవణ్, బాల, అనిల్, మళ్లీ రెడ్డి, నారాయణ, శేఖర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్