రూ.3.50 కోట్లతో మల్టీ స్పోర్ట్స్ అరేనా.. త్వరలో రూ.35 కోట్లతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం..
ఉప్పల్, ఆగస్టు 19 (శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్.ప్రవీణ్ కుమార్):ఉప్పల్ భగాయత్ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో భగాయత్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తున్నారని తెలిపారు.
బుధవారం ఉప్పల్ భగాయత్‌లో రూ.3.50 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ స్పోర్ట్స్ అరేనాను పరమేశ్వర్ రెడ్డి కాలనీవాసులు, హెచ్ఎండీఏ, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో బేబీ పూల్, స్విమ్మింగ్ పూల్, ట్రిపుల్ జంప్, ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మల్టీ స్పోర్ట్స్ అరేనా నిర్మాణం పూర్తయితే ఉప్పల్ భగాయత్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని, పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
త్వరలో రూ.35 కోట్లతో ఫుట్‌పాత్‌లు
భగాయత్‌లో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే రూ.35 కోట్లతో ఫుట్‌పాత్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ భగాయత్‌కు అవసరమైన మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వక్కంటి శ్రీనివాస్ రావు (VAIK ప్రెసిడెంట్), బిజ్జుల రవీందర్ రెడ్డి, వంశీ చంద్ర రెడ్డి, ఈగ సంతోష్, పూజల ప్రభాకర్, విశ్వనాథ్, శివ ప్రసాద్ రావు, సూర్యగోపాల్, చారి, తుమ్మల దేవి రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, రఫిక్, సల్లా ప్రభాకర్ రెడ్డి, సుంకు శేఖర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, మూర్తి, మనోహర్ రెడ్డి, మహేష్, మురళి, రాఘవేంద్ర రెడ్డి, మల్లికార్జున్, సందీప్, యాదవల్లి రాజు, విప్లవ్ రెడ్డి, కిషన్, ముత్యంగారి రవి, శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బంగ్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, సంగమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












