E-PAPER

హైదరాబాద్‌లో 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

హైదరాబాద్‌లో 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం

హైదరాబాద్, ఆగస్టు 18, (శుభ తెలంగాణ ప్రతినిధి /కే నరేష్ యాదవ్ )నగరంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై హెచ్-ఫాస్ట్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్, ఆహార భద్రతా శాఖతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీగా కల్తీ నెయ్యితో పాటు ముడి పదార్థాలు, అనుమతి లేని రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 130 సంస్థలను తనిఖీ చేయగా, ఇందులో 39 నెయ్యి తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో నాణ్యత లేని, నకిలీ పదార్థాలతో పాటు రసాయనాలను వినియోగించి సింథటిక్ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం దాన్ని ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ప్రముఖ బ్రాండ్ల పేరుతో ‘ప్యూర్ దేశీ నెయ్యి’గా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

తనిఖీల్లో మొత్తం 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
 పలు రాష్ట్రాల నుంచి పాల క్రీమ్‌ కొనుగోలు..
కల్తీ నెయ్యి తయారీలో ఉపయోగించే పాల క్రీమ్‌ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చౌకైన ప్రత్యామ్నాయ పదార్థాలు, రసాయనాలతో తక్కువ ఖర్చుతో నెయ్యిని తయారు చేసి, అసలైన నెయ్యిగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కల్తీ నెయ్యిని ప్రధానంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ తయారీ కేంద్రాలు, ఆయుర్వేద దుకాణాలు, పూజా అవసరాల కోసం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి కల్తీ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ ప్రత్యేక తనిఖీలను హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ నేతృత్వంలో నిర్వహించారు. హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్యతో పాటు ఎస్‌ఐలు రమ్య, అభిలాష్, శంకర్, కృష్ణ, అఖిల్ తదితరులు ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్