చర్లపల్లి డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టి..
చర్లపల్లి, 18 ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి /ఎన్. ప్రవీణ్ కుమార్),చర్లపల్లి డివిజన్‌లో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా పెండింగ్‌లో ఉండటంపై ఉప్పల్ ఎమ్మెల్యే **బండారి లక్ష్మారెడ్డి** సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి IAS ను ఎమ్మెల్యే కలిసి, డివిజన్‌లో మంజూరైన అభివృద్ధి పనుల వివరాలపై చర్చించారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
మంజూరైన పనులను ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. అలాగే ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.
చర్లపల్లి డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని బండారి లక్ష్మారెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












