E-PAPER

ఫూల్‌బాగ్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

ఫూల్‌బాగ్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్, ఆగస్టు 18, (శుభ తెలంగాణ ప్రతినిధి/కే.నరేష్ యాదవ్ ): ఫూల్‌బాగ్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ప్రభావతి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.
అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కొందరు ఉద్యోగులు లంచాలకు పాల్పడుతున్న ఘటనలు కొనసాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్