మీర్పేట్ హెచ్బీ కాలనీ, 18 ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్. ప్రవీణ్ కుమార్): సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఫేజ్-1 ప్రధాన కూడలిలో ఆయన విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పేర్కొన్నారు.












