ఉప్పల్, 18 ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్. ప్రవీణ్ కుమార్): రామంతాపూర్ మెయిన్ రోడ్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో గుడ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ వర్ధంతి అన్నదాన కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై నివాళులర్పించారు.
కరెంట్ షాక్‌తో మృతి చెందిన రాజేంద్ర రెడ్డి, కాటేపల్లి శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, చెట్టబోయిన సురేష్ యాదవ్, పింజర్ల క్రిష్ణ యాదవ్ (డైమండ్ యాదవ్)ల ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను పరామర్శించి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నప్రసాదం అందించారు.
మరణించిన వారి జ్ఞాపకార్థం అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












