చర్లపల్లి 18 ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి /ఎన్. ప్రవీణ్ కుమార్), చర్లపల్లి డివిజన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్న చర్లపల్లి కల్లు కాంపౌండ్ వద్ద, పెద్ద చర్లపల్లి చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలను నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న గౌడ్ వంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు రుద్రగోని రాంచందర్ గౌడ్, బూడిద శ్రావణ్ కుమార్ గౌడ్, నిమ్మల అశోక్ గౌడ్, కాసుల శశికాంత్ గౌడ్, రాగిరి బాబు గౌడ్, రాగిరి నాదం గౌడ్, కీసర ప్రేమ్ గౌడ్, కాసుల శ్రీకాంత్ గౌడ్, బొడిగె శ్రీరాములు గౌడ్, బొడిగె రాములు గౌడ్, రాగిరి వినయ్ గౌడ్, బొడిగె సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












