E-PAPER

బీఎస్పీకి ప్రత్యామ్నాయం లేదు.. సెక్టార్ కమిటీలతో పార్టీ బలోపేతం

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

బీఎస్పీకి ప్రత్యామ్నాయం లేదు.. సెక్టార్ కమిటీలతో పార్టీ బలోపేతం

హైదరాబాద్, ఆగస్టు 18,(శుభ తెలంగాణ ప్రతినిధి/కే. నరేష్ యాదవ్ ) బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్లు అతర్ సింగ్ రావు, సురేష్ ఆర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, బెహెన్ మాయావతి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల స్ఫూర్తితో ప్రజల్లో పనిచేయాలని, పార్టీ బలోపేతానికి సెక్టార్ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అవసరమైన ఆర్థిక వనరులను కార్యకర్తలే సమకూర్చుకోవాలని అన్నారు. సమావేశంలో రాష్ట్ర, జోనల్, పార్లమెంట్, జిల్లా స్థాయి నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్