కాప్రా, ఆగస్టు 18 (శుభ తెలంగాణ ప్రతినిధి/ఎన్. ప్రవీణ్ కుమార్):కాప్రా సర్కిల్ పరిధిలోని వంపుగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడలో విజన్ ఆప్టికల్స్ మూడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు అజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజన్ ఆప్టికల్స్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో నిర్వాహకులు, సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.












