E-PAPER

ఉప్పల్‌కు బ్లడ్ బ్యాంక్, డయాగ్నస్టిక్ సెంటర్ మంజూరు చేయాలి..

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

ఉప్పల్‌కు బ్లడ్ బ్యాంక్, డయాగ్నస్టిక్ సెంటర్ మంజూరు చేయాలి..

మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి...

హైదరాబాద్ 18 ఆగస్టు ( శుభ తెలంగాణ ప్రతినిధి /కే. నరేష్ యాదవ్)ఉప్పల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, సమగ్ర డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఉప్పల్‌లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, పూర్తి స్థాయి డయాగ్నస్టిక్ సెంటర్ లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

కాంపోనెంట్ సెపరేషన్ సదుపాయంతో కూడిన బ్లడ్ బ్యాంక్‌తో పాటు పాథాలజీ, రేడియాలజీ, USG తదితర సేవలతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉప్పల్‌తో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, జేట్ట కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి…

హైదరాబాద్ 18 ఆగస్టు ( శుభ తెలంగాణ ప్రతినిధి /కే. నరేష్ యాదవ్)ఉప్పల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, సమగ్ర డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఉప్పల్‌లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, పూర్తి స్థాయి డయాగ్నస్టిక్ సెంటర్ లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

కాంపోనెంట్ సెపరేషన్ సదుపాయంతో కూడిన బ్లడ్ బ్యాంక్‌తో పాటు పాథాలజీ, రేడియాలజీ, USG తదితర సేవలతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉప్పల్‌తో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, గంధం నాగేశ్వర్ రావు, జేట్ట కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్