ఉప్పల్, ఆగస్టు 14(శుభ తెలంగాణ ప్రతినిధి /ఎన్. ప్రవీణ్ కుమార్) ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో నెలకొన్న మంచినీరు, డ్రైనేజీ, వర్షపు నీటి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి HMWSSB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ ను కోరారు.
శుక్రవారం కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈడీని కలిసిన ఆయన, పెండింగ్‌లో ఉన్న సీవరేజ్ లైన్లు, నీటి సరఫరా పైప్‌లైన్లు, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, నీటి కాలుష్య సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తిపై ఈడీ పంకజ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.












