శామీర్‌పేట్,ఆగస్టు 14 (శుభ తెలంగాణ ప్రతినిధి/డి. దయానంద్): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్‌పేట్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద బొమ్మరాశిపేట భూ బాధితులకు మద్దతుగా నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు.
భూ బాధితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు.












