కాప్రా, ఆగస్టు 14(శుభ తెలంగాణ ప్రతినిధి / ఎన్ ప్రవీణ్ కుమార్) కాప్రా డివిజన్ రామ్‌దాస్ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటించారు. కాలనీ అభివృద్ధికి గతంలో ఆయన చేసిన కృషిని గుర్తుచేస్తూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సన్మానించారు.
కాలనీలోని నాలుగు చిన్న వీధుల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాలనీ అభివృద్ధికి స్వర్ణరాజ్ శివమణి చేసిన కృషిని వారు కొనియాడారు.
కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు పి. పవన్ కుమార్, బాబురావు, నరేందర్ గౌడ్, జి. సత్యనారాయణ, సతీష్ యాదవ్, నాగరాజ్ యాదవ్ తదితరులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.












