E-PAPER

ధరణి వెబ్సైట్లో భూ రికార్డుల తారుమారు కేసులో ఏసీబీకి అడ్డంగా దొరికిన జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి

(శుభ తెలంగాణ/రంగా రెడ్డి)రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని, రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ట్రాప్ జరిగింది. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలనే అభ్యర్థనతో మధుమోహన్ రెడ్డి ఎనిమిది లక్షల లంచం డిమాండ్ చేశాడు.

బాధితుడు కారులో డబ్బులు ఇస్తుండగా, సీనియర్ అసిస్టెంట్‌ మధుమోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మధుమోహన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెప్పిన ప్రకారం డబ్బులు తీసుకున్నానని అంగీకరించాడు.

ఏసీబీ అధికారుల సమక్షంలోనే, మధుమోహన్ రెడ్డి జాయింట్ కలెక్టరుతో ఫోన్‌లో మాట్లాడి, పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని సూచించాడు. ఆ సందర్భంలో, జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :