(శుభ తెలంగాణ/నెల్లూరు జిల్లా /14 జనవరి)నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలం గండురుపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు మన భారతీయ సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించేలా అందమైన, రంగురంగుల ముగ్గులను వేశారు.
ప్రత్యేకంగా భారత జాతీయ చిహ్నమైన అశోక చక్రం ను ముగ్గుగా రూపుదిద్దుతూ దేశభక్తి భావాలను చాటారు. చిన్నారుల సృజనాత్మకత, కళాత్మకత గ్రామస్తులను ఆకట్టుకుని, భారతదేశానికి గౌరవం చేకూర్చే విధంగా నిలిచింది.
ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో దేశభక్తి భావనలు, మన సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించడమే కాకుండా, సంక్రాంతి పండుగ యొక్క అసలైన ఆత్మను ప్రతిబింబించిందని పలువురు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు చిన్నారులను అభినందిస్తూ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని సాయి యాదవ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.










