(శుభ తెలంగాణ/హైదరాబాద్) తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు మాజీ జీ.పీ డి.ఎల్. పాండు ముదిరాజ్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ముదిరాజ్ మత్స్యకారుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ,ముదిరాజ్ హక్కుల కోసం హైకోర్టులో వాదనలు వినిపించిన పాండు ముదిరాజ్ మత్స్యకారుల సభ్యత్వాలు, ఎన్నికలు నిర్వహించాల్సిన అంశాలను న్యాయస్థానంలో ప్రతిపాదించారు.ఈ కృషికి గాను ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు జీపీ ఎన్.ఎస్. అర్జున్ కుమార్ ముదిరాజ్, హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ చిల్ల రమేష్ ముదిరాజ్, ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతన బోయిన రామారావు ముదిరాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీ, ఆంజనేయులు ముదిరాజ్, భీమ్సేన్ ముదిరాజ్, మదన్మోహన్ అడ్వకేట్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై డి.ఎల్. పాండు ముదిరాజ్ సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా, ముదిరాజ్ హక్కుల పరిరక్షణకు మరింత శ్రద్ధ వహించాలని అందరూ ఐక్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.