E-PAPER

జర్నలిస్టుల సంక్షేమంపై చిత్తశుద్ధితో ముందడుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాత్రికేయుల కృతజ్ఞతలు

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

జర్నలిస్టుల సంక్షేమంపై చిత్తశుద్ధితో ముందడుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాత్రికేయుల కృతజ్ఞతలు

(శుభ తెలంగాణ/ఢిల్లీ)జర్నలిస్టుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ,వాటిని వేగంగా అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగు మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని అక్కడి తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం కలుసుకుంది.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు,హెల్త్‌ కార్డులు, అక్రిడిటేషన్‌ వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోవడాన్ని వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రి తెలంగాణ మీడియా అకాడమీకి రూ.10 కోట్లు ప్రకటించడాన్ని జర్నలిస్టు సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నిజమైన జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్