హైదరాబాద్, జనవరి 26 (శుభ తెలంగాణ):ఆదివారం తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎం.నరేష్, సెక్రటరీ,ఐఎన్‌టీయూసీఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాసరి అంజయ్య,అధ్యక్షులు హాజరై, జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ (ఏడి/టీ) అలాగే ముఖ్య అతిథిగా పాల్గొని, గణతంత్ర దినోత్సవం యొక్క మహత్తును వివరించారు. ఆయన మాట్లాడుతూ, “మన దేశానికి రాజ్యాంగం ఇచ్చిన విలువలు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, స్వేచ్ఛ, మరియు సమాజ న్యాయం అందించేందుకు మార్గదర్శకంగా నిలిచాయి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో హరిక్రిష్ణ,రాజ శేఖర్ ఇస్తాకారి, ఎండి ఖాజా మెయిన్ఉద్దీన్,డేవిడ్, రాజేష్,దాసరి ప్రసాద్,ఎం. విజయ్ తదితరులు పాల్గొన్నారు. వీరు జాతీయ జెండాకు నివాళులు అర్పించి, దేశ అభివృద్ధి పట్ల తమ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. .ఈ సందర్భంగా పలువురు అధికారులు మరియు సిబ్బంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
