(శుభ తెలంగాణ ఏసీబీ స్పెషల్)గత మే నెల 28 న, ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఆర్ టీ ఓ ఆఫీస్ పై ముక్ముడుగా తనిఖీలు నిర్వహించబడ్డాయి.ఈ తనిఖీ సమయంలో,డిటీవో వద్ద పనిచేస్తున్న పర్సనల్ డ్రైవర్ మరియు మరొక వ్యక్తి వద్ద 65 వేల రూపాయలు మరియు ఒక సెల్ ఫోన్ పట్టుబడ్డాయి.సెల్ ఫోన్ ఆధారంగా, డిటీవో మహ్మద్ గౌస్ పాషా 2 కోట్ల 97 లక్షల 38 వేల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ కేసులో, డిటీవో గౌస్ పాషా మరియు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిని వరంగల్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఇంకా, పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది.