E-PAPER

జర్నలిస్టుల రక్షణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలి ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నరగౌని డిమాండ్..

వరంగల్ జిల్లా కమిటీ పునరవ్యవస్తీకరణ జిల్లా నూతన అధ్యక్షుడిగా కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఏ. కుమారస్వామీ, కోశాధికారిగా బత్తుల సత్యం ఎన్నిక..

స్థానిక పత్రికల (చిన్న పత్రికల) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…

వరంగల్, నవంబర్ 15(శుభ తెలంగాణ): జర్నలిస్టుల రక్షణ చట్టం రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ వరంగల్ జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఏ సందర్బంగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ, జర్నలిస్టుల రక్షణ కోసం జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు పరచాలని అన్నారు.. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, మరియు తప్పుడు కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు.సమావేశంలో కండికొండ మోహన్ అధ్యక్షుడిగా, అవునూరి కుమారస్వామి జనరల్ సెక్రటరీగా,బత్తుల సత్యం ఖజాంచీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రధాన డిమాండ్లు:

1. సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి

జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని, యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

2.చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి, వాటిని ఎమ్పానెల్‌మెంట్‌లో చేర్చాలని కోరారు.

3.మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి, జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు.

4.మీడియా ఉద్యోగుల సంక్షేమం

జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్, మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.

జిల్లా కార్యవర్గం:అధ్యక్షుడిగా కందికొండ మోహన్,ప్రధాన కార్యదర్శిగా అవునూరి కుమార్, కోశాధికారి బత్తుల సత్యం, ఉపాధ్యక్షులుగా లింగబత్తిని కృష్ణ, కందికొండ గంగరాజు, నగపూరి నాగరాజు, సహాయ కార్యదర్శులుగా ఈద శ్రీనాథ్, వల్లేపు భాగ్యరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పంచకం నర్సయ్య, అడుప అశోక్, నీరూటి శ్రీహరి, నాగపూరి అవినాష్, కార్యవర్గ సభ్యులుగా గోనె కమలాకర్, సుంకరి కళ్యాణ్, మంతెన సురేష్ లు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శిగా రావుల నరేష్ ను ఎన్నుకోవటం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :