E-PAPER

శ్రీ హరి హర పుత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఘనవిజయం..

కాప్రా, గాంధీనగర్ (శుభ తెలంగాణ): శ్రీమైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో శ్రీ హరి హర పుత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి వారి మహా పడి పూజ భక్తుల సందడి మధ్య విజయవంతంగా జరిగింది. కొత్త సంవత్సర ప్రారంభంలో, స్వామివారి ఆశీర్వాదం కోసం వేలాది మంది భక్తులు ఈ మహా పూజకు హాజరయ్యారు.

పూజా కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై, వైభవంగా సాగింది. ప్రత్యేక అలంకరణలతో భక్తులు స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు తరలివచ్చారు.పూజ సమయంలో స్వామి భక్తులు భక్తి భావంతో “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో దేవాలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.

ఈ కార్యక్రమం హరి హర పుత్ర సేవా సంఘం,గురుస్వాములు ఆధ్వర్యం ప్రత్యేక హోమాలు,శబరి మాల పూజ,మరియు పడి పూజ ప్రధాన కార్యక్రమాలుగా నిర్వహించబడ్డాయి.

పూజ అనంతరం భక్తులకు మహా ప్రసాదం పంపిణీ చేయబడింది.శ్రీ హరి హర పుత్ర సేవా సంఘం సభ్యులు తమ సమిష్టి కృషితో ఈ పూజను విజయవంతంగా నిర్వహించగలిగారు.

భక్తుల హాజరు, సమగ్ర నిర్వహణ ఈ మహా పడి పూజను మరింత వైభవంగా నిలిపాయి.శ్రీ హరి హర పుత్ర సేవా సంఘం నాయకులు ఈ విజయానికి కారణమైన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మహా పడి పూజకు హాజరైన భక్తులు స్వామి వారి కృపతో కొత్త సంవత్సరాన్ని విజయవంతంగా ప్రారంభించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :