E-PAPER

ప్రజా ప్రభుత్వంలోనే రైతు సంక్షేమం. రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది..

ఉప్పల్ /శుభ తెలంగాణ దిన పత్రిక…
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం సాధ్యమని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కె దక్కుతుందని తెలిపారు.
రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి హర్షిస్తూ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున భాణసంచా పేల్చారు.2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని  మాట ఇచ్చారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని గుర్తు చేశారు.ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో  సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆగస్టు లో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ  చేసి  ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మభ్యపెట్టలేదన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తొఫిక్,ఆగి రెడ్డి,చెన్ రెడ్డి రఘపతి రెడ్డి,బజార్ జగన్నాథ్ గౌడ్,గిరిబాబు,జలీల్ పశ,ఆగం రెడ్డి ,డివిజన్ అద్యక్షులు,బాకారం లక్ష్మణ్ ,రఫీక్ ,విజయ్ ,రాజేష్ ముదిరాజ్ ,ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,లూకాస్ ,బొక్క సురేష్ ,ఈగ అంజి , దేవి రెడ్డి ,నామ్ రాజ్ రెడ్డి ,మంచాల రఘు ,భాస్కర్ రెడ్డి ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,నల్లవెలి మహేష్ ముదిరాజ్ ,సందీప్ ,అలీమ్ ,మంద మురళి ,సుంకు శేఖర్ రెడ్డి ,బజార్ నవీన్ గౌడ్ ,తోకటి రాజ్ ,బాకారం అరుణ్ ,సి డి వెంకట్ ,ప్రశాంత్ రెడ్డి ,జనగామ రామకృష్ణ ,మధుసూదన్ రెడ్డి ,ఈగ రాజేష్ ,పాస్తం శ్రీరాములు ,సత్యనారాయణ ,సతీష్ గౌడ్ ,షాగా శ్రీధర్ ,అంజయ్య ,గొరిగ మహేష్ ,గీత ,వెంకటేష్ గుప్తా ,అశోక్ ,సచిన్ ,బూత్కూరి రాజ్ ,భాస్కర్ ,అలుగుల అనిల్ ,ఆఫ్జాల్ ,మీనం పల్లి కిషోర్ ,రాజేందర్ రెడ్డి అస్లాం ,రంగుల శేఖర్ మహిళా కాంగ్రెస్ నాయకులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్ సి సెల్ ,బి సెల్ నాయకులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :