ఉప్పల్, ఆగస్టు 15(శుభ తెలంగాణ ప్రతినిధి /ఎన్.ప్రవీణ్ కుమార్): ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్-4లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు గొల్లూరి అంజయ్య నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్, చైతన్యనగర్ తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి సందేశాన్ని చాటారు.
అనంతరం చైతన్యనగర్ 2BHK జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసాధనా సంస్థ సౌజన్యంతో విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంజయ్య పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు.












