E-PAPER

తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు…     

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు…     

(శుభ తెలంగాణ/హైదరాబాద్)హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.చాకలి ఐలమ్మ 39వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా,ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తూ,ఆమె మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించనట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములుగా కొనసాగాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు.

చాకలి ఐలమ్మ పేదలకు వేలాది ఎకరాలను దొరల చేతుల్లో నుంచి తీసి అందించాలని పోరాటం చేశారు అని, ఆమె స్పూర్తితో ఇందిరా గాంధీ దేశంలో భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది.భూమి పేదవాడి ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిచేశారు అని ఆయన చెప్పారు.

ధరణి ముసుగులో కొందరు పేదల భూములను కాజేయాలన్న కుట్ర జరుగుతోందని,ఈ నేపథ్యంలో పేదల భూములను కాపాడేందుకు ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో,చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను నృత్య రూపకంగా ప్రదర్శించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల బృందాన్ని కూడా సీఎం అభినందించారు.కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్