(శుభ తెలంగాణ/హైదరాబాద్)హైదరాబాద్ లో మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ సీసీ విద్యార్థులతో టీఎస్ఎస్ఓ రాష్ట్ర కమిటీ నిర్వహించిన అనంత కోటి వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ జన్మదిన సందర్భంగా కళాశాల ఎన్ సీసీ విద్యార్థులతో కలిసి మొక్కను నాటిన అనంతరం కేక్ కట్ చేసి 200 మంది విద్యార్థులకు స్వీట్స్ బిస్కెట్లు మరియు ఆహార పదార్థాలలు పంచడం జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అలాగే ప్రతి ఒక్క విద్యార్థి తమ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని సూచించారు.నా జన్మదిన సందర్భాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన టీఎస్ఎస్ఓ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్,టీఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి మీసాల వంశీ,టీఎస్ఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యులు సుదర్శన్,ప్రవీణ్,వంశీ,సాయి చరణ్,అభిజిత్, డాన్సర్ చిక్కి మరియు ఎన్ సీసీ విద్యార్థులు,కళాశాల బృందం తదితరులు పాల్గొనడం జరిగింది.