(శుభ తెలంగాణ/హైదరాబాద్)వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు.ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలుసుకుని విరాళం చెక్కును అందజేశారు.సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు ఇలాంటి విరాళాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ప్రజలు తమ వంతు సహకారం అందించడం వల్ల బాధితులను త్వరితగతిన ఆదుకోవడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.సూర్యదేవర నాగవంశీ సహకారం ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత శక్తినిచ్చేలా ఉంటుందని సీఎం అభినందించారు.ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ, వరదల”వల్ల బాధపడుతున్న ప్రజలకు ఈ విరాళం ద్వారా కొంత సాయం చేయగలగడం నాకు సంతోషంగా ఉంది.బాధితుల పునరావాసం కోసం కొనసాగుతున్న ప్రభుత్వ చర్యలకు నా వంతుగా తోడ్పడడం నా బాధ్యతగా భావిస్తున్నాను,” అని తెలిపారు.