E-PAPER

నిరసన కార్యక్రమం: షాపూర్ నగర్ వంతెన ప్రారంభంపై బిజెపి నేతల ఆందోళన

(కుత్బుల్లాపూర్/శుభ తెలంగాణ)కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షాపూర్ నగరానికి దగ్గరగా నిర్మించిన పాదచారుల వంతెన పనులు 6 నెలల క్రితమే పూర్తయ్యాయి. అయితే, వంతెన ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ, బిజెపి మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రంగంపేట మరియు అసెంబ్లీ కన్వీనర్ సాయి జైవాంత్ నేతృత్వంలో జూన్ మరియు జూలై నెలల్లో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ మరియు గాజుల రామారాం ఉప కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు.అయినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో,గత నెల కమిషనర్ కి అల్టిమేట్ ఇవ్వబడింది. పది రోజుల్లో వంతెన ప్రారంభించకపోతే బిజెపి నాయకత్వంలో నిరసన తెలిపే అవకాశం ఉందని తెలియజేయడంతో, 20 రోజులు గడిచిన తరువాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో,మంగళవార భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా, అసెంబ్లీ కన్వీనర్ జేక్సే ఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి వంతెనపైకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ రావుల శేషగిరి, కొంపల్లి కౌన్సిలర్ రాజిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చెంది శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు భవిగడ్డ రవి, గరిగె శేఖర్ ముదిరాజ్, కో కన్వీనర్ శివాజీ రాజు, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరకల సుధా, జిల్లా సెక్రటరీ కేశవ్ యాదవ్, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి భాను చందర్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అలివేలు, అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ నాగమణి, ఓబిసి అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ వర్మ, డివిజన్ అధ్యక్షులు పులి బలరామ్, పత్తి సతీష్, సాయినాథ్ నేత, రాజేశ్వరరావు, కంది శ్రీరాములు, దుర్యోధనరావు, పరుష వేణు, పున్నారెడ్డి, మల్లేష్ యాదవ్, సురేష్ గౌడ్, సైదులు, సంతోష్ గుప్తా, ఝాన్సీ, బాబి నీల, వసుంధర, చక్రధర్, శేషారావు, మహేందర్ మరియు సోషల్ మీడియా నాయకులు భాను ప్రసాద్ గౌడ్, నాగరాజు, రాము పటేల్, కురు మూర్తి, ఆదిత్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :