E-PAPER

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఫెడరేషన్

(హైదరాబాద్/శుభ తెలంగాణ )ఆగస్టు14: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను తెలంగాణ బార్ కౌన్సిల్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఫెడరేషన్ కార్యదర్శి మరియు నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ వర్ధన్ రెడ్డి ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ అమానుష దాడులను ఖండించేందుకు ప్రపంచం మొత్తం సంఘీభావం తెలిపాలని కోరారు.బుధవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో రాజ్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం పేరిట అమాయక హిందువులపై దాడులు జరగడం దుర్మార్గమని అన్నారు. ఈ దాడుల వల్ల హిందువులు తమ ఆస్తులు, ప్రాణాలు కోల్పోతున్నారని, వారు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని ఆయన తెలిపారు.ర్యాలీలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని, హిందువులకు మద్దతుగా, దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంలో రాజ్ వర్ధన్ రెడ్డి, “అక్కడి హిందువులపై జరిగే ఈ దాడులను ప్రపంచం నిశ్శబ్దంగా చూడకూడదు. ఇలాంటి సమయంలో వారికి మద్దతుగా ప్రపంచం నలుమూలల మానవతా వాదులు నిలవాలి,” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీ.వి. శ్రీనాథ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు నిలం భార్గవ్ రాం, మాజీ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, సీనియర్ న్యాయవాదులు జక్కుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :