E-PAPER

మైత్రి ఎంక్లేవ్‌లో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటన….

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

మైత్రి ఎంక్లేవ్‌లో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటన….

కాప్రా, ఆగస్టు 13(శుభ తెలంగాణ ప్రతినిధి /ఎన్. ప్రవీణ్ కుమార్)కాప్రా సర్కిల్ వంపుగూడ డివిజన్ లోని మైత్రి ఎంక్లేవ్ ఎక్స్‌టెన్షన్‌లో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు కాలనీలో పర్యటించిన ఆయనకు స్థానికులు అంతర్గత రోడ్లు, బాక్స్ డ్రైనేజీ నిర్మాణం తదితర సమస్యలను వివరించారు.

సమస్యలను పరిశీలించిన స్వర్ణరాజ్ శివమణి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో వంపుగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనూప్ రాజ్ (టిల్లు) యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండ్ల మురళీ, సీనియర్ నాయకులు పి. పవన్ కుమార్, ప్రదీప్, వినయ్, అలీ, సద్దాం తదితరులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్