నాచారం, ఆగస్టు 14(శుభ తెలంగాణ ప్రతినిధి/ ఎన్ ప్రవీణ్ కుమార్) మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని ఎర్రకుంట,నాచారం 21వ డివిజన్‌లో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు తదితరాల్లో నిల్వ నీటిని తొలగించాలని సూచించారు.
ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టి వ్యాధుల నివారణకు సహకరించాలని అధికారులు కోరారు.












