(మేడ్చల్ జిల్లా/శుభ తెలంగాణ)డ్రెయినేజీ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు.జవహర్ నగర్ కార్పొరేషన్,బాలాజీ నగర్,ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ వంపుగూడలో డ్రెయినేజీ సమస్యలను బుధవారం మేడ్చెల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ లతో కలిసి పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను మరుగున పడేశారని,అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలను గుర్తించి మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రజాపాలనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఉప్పల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని,వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అదిక నిధులు తెచ్చి ప్రజల కష్టాలను ప్రాలదోలుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి,మేడ్చెల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి,జవహర్ నగర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్,డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి,సీతారాం రెడ్డి,అంజి రెడ్డి,రాఘవ రెడ్డి,పెద్ది సీను,కాప్రా డివిజన్ అధ్యక్షులు నాగశేషు,ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్ గారు,మల్ల రెడ్డి,సత్యనారాయణ,
నాగరాజ్,పాకాల రాజు,అల్లూరయ్య,పూర్ణ యాదవ్,రాకేష్ యాదవ్,గురాళ్ళ సంతోష్ రెడ్డి,లింగం, పవన్,విట్టల్,రమాకాంత్ రెడ్డి,సుంకు శ్రీకాంత్ రెడ్డి,భూపాల్,నర్సింహ,అనిల్,ప్రశాంత్,శ్రీధర్ రెడ్డి, సతీష్,బాబుజగదీష్,బిఏంగౌడ్,గణేష్,అరుణ్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.