E-PAPER

న్యాయవాదులపై పోలీసుల దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జ్ లు ధరించి విధులకు హాజరు.

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

న్యాయవాదులపై పోలీసుల దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జ్ లు ధరించి విధులకు హాజరు.

(కామారెడ్డి/శుభ తెలంగాణ)జనగామలో న్యాయవాద దంపతులపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం కామారెడ్డి న్యాయవాదులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు విధులకు హాజరయ్యారు.అలాగే జిల్లా కోర్టు ప్రాంగణం ముందు ధర్నా చేసి జనగామ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై దాడి చేయడం పోలీసులకు పరిపాటి అయిందని,ఈ విషయమై సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే న్యాయవాదులు రక్షణ చట్టం అమలు చేయవలసిందిగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, శంకర్ రెడ్డి,అన్వర్ షరీఫ్,సిద్ధి రాములు, శ్యామ్ గోపాల్,బిక్షపతి,అమృత రావు, అతిమాముల శ్రీధర్,గోవర్ధన్ మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్