E-PAPER

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: కోటి మహిళలను కోటీశ్వరులను చేయడం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

(శుభ తెలంగాణ/మహబూబాబాద్)రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం,కోటి మందిమహిళలను కోటీశ్వరులను చేయడమే అని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు,వివిధ వ్యాపారాలకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

 

గురువారం,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్,జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ లతో కలిసి,ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో,ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కొన్ని కొత్త ఆవిష్కరణలు ప్రారంభించారు.ఈ ఆవిష్కరణల్లో శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్, కోమలి డిజిటల్ స్టూడియో,బుక్ స్టాల్,జిరాక్స్,ఇంటర్నెట్ సెట్ సెంటర్,సునిత ఎంబ్రాయిడరీ వర్క్స్,సారీ సెంటర్,శ్రీ వెంకటేశ్వర కిరాణా జనరల్ స్టోర్ మొదలైనవి ఉన్నాయి.

 

అదనంగా,రాంసింగ్ తండా లో రూ.10 లక్షల,శివ తండా లో రూ. 20 లక్షలతో నిర్మించిన బిటి రోడ్లు,జాకారం గ్రామంలో రూ. 28.25 లక్షలతో నిర్మించిన డైరీ ఫారం,పాల శీతలీకరణ కేంద్రం, ములుగు-బుద్దారం రహదారిలో కిలోమీటర్ 0/0 నుండి 1/0 వరకు నిర్మించిన 4 వరుసల రహదారి,పులిగుండం గ్రామం నుండి చింతకుంట వరకు రూ.70 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డు,జంగాలపల్లి – అంకన్న గూడెం రహదారి వెడల్పు పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ,మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రుణాలు అందించి,అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.సోలార్ ప్లాంట్ మరియు ఇతర ఆవిష్కరణలు మహిళలు సమర్థంగా ఉపయోగించుకోవాలని,ప్రజల మనోభావాలను మరింత మెరుగు పరచాలని కోరారు.

 

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో,జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు కలిసి పనిచేయాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యుదయానికి కట్టుబడుతున్నారని చెప్పారు. ములుగు జిల్లాలో త్వరలో కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ,మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభమవుతాయని,భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడతాయని తెలిపారు.

 

రామప్ప యూనెస్కో గుర్తింపు పొందిన స్మారకాలను రూ. 100 కోట్లతో అభివృద్ధి చేయడం,రామప్ప సరస్సులో ఐలాండ్ ఏర్పాటు చేయడం వంటి ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి వినతించామని,పర్యాటకులను ఆకర్షించే విధంగా పనులు పూర్తి చేయాలన్న వాగ్దానం చేశారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు,ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి,ట్రైబల్ వెల్ఫేర్,ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్ ఈఇలు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :