E-PAPER

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతలు: భారీగా పోలీస్ బందోబస్తు….

(హైదరాబాద్/శుభ తెలంగాణ)తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మరియు అరికెపూడి గాంధీ మధ్య జరిగిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించినప్పటి నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరచూ విమర్శలు చేస్తుండటంతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.వారు కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరి, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కుర్చీలతో దాడి చేసి,అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు.ఈ ఘర్షణ నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

 

పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. వారు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడంతో పాటు ఇంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ, గాంధీ అనుచరులను, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు సమర్థంగా నిలువరించలేకపోయారని తెలిసింది.

ఇదంతా జరుగుతున్న సమయంలో పోలీసులు పరిస్థితిని శాంతి పరచడానికి ప్రయత్నించినప్పటికీ,ఉద్రిక్తతలు తగ్గలేదు.సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడి మరువకముందే,కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈ దాడి తెలంగాణ రాజకీయాలలో వేడి వాతావరణం సృష్టించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :