(హైదరాబాద్/శుభ తెలంగాణ)తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టీజీసీవో) వరద బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.ఈ విరాళాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన టీజీసీవో సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.వరద బాధితుల పునరావాసం కోసం తమ వంతు సాయం చేసినందుకు టీజీసీవో పై అభినందనలు వ్యక్తం చేశారు.