పోలీసులపై ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసులను నమోదు చేసి,శిక్షించాలి-న్యాయవాది రాధిక..
ప్రభుత్వం బాధితురాలికి నష్ట పరిహారం చెల్లించాలి-న్యాయవాది దొడ్డి శ్రీనివాస్
(షాద్ నగర్/శుభ తెలంగాణ)బహుజన సైన్యం,బహుజన అడ్వకేట్స్ సమాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బహుజన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్ట్ న్యాయవాది పోలె విష్ణు మాట్లాడుతూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దొంగతనం పేరుతొ మాల కులానికి చెందిన పెరుక సునీతపై,భర్త భీమయ్యలపై దొంగతనం నెపం మోపి,పోలీసు స్టేషన్ లో బందించి చిత్ర హింసలకు గురిచేశారని,నేరాన్ని ఒప్పుకోమ్మని బలవంతం చేశారని,మహిళను డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి మరియు పోలీసు సిబ్బంది తీవ్రంగా కొట్టారని,మహిళ కాళ్లు మోచేతులు మలచి కట్టేసి కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు,పోలీసులకు కొట్టె హక్కు లేదని,జై భీమ్ సినిమాను తలపించిదని,ప్రభుత్వం పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిందని,సస్పెన్షన్ వెటుకాదు-ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది రాధిక మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని,అర్ధరాత్రి వరకు చిత్ర హింసలకు గురిచేయడం చట్ట విరుద్దమని,షాద్ నగర్ పోలీసులపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి వారిని ఉద్యోగం నుండి తొలగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీసులు అటవీక చర్యలకు పాల్పడినారని,ఈ విషయంపై మహిళ కమిషన్,ఎస్సి,ఎస్టీ కమిషన్ స్పందించి బాధితులకు రక్షణ కలిపించాలని,వారికి నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో బహుజన సైన్యం రాష్ట్ర ఉపాధక్ష్యులు దర్శనం శ్రీనివాస్,న్యాయవాది మంగళం రాకేష్ పాల్గొన్నారు.