(హైదరాబాద్ /శుభ తెలంగాణ)పారిస్ ఒలింపిక్స్ 2024లో మన దేశం తరపున తొలి మెడల్ సాధించిన షూటర్ మను బాకర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మను విజయం అందరినీ గర్వపడేలా చేసిందని ఒక సందేశంలో సీఎం పేర్కొన్నారు.
ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 స్కోరుతో మను బాకర్ కాంస్య పతకం సాధించారు.