తెలంగాణ ప్రజాశక్తి పార్టీ పట్టణ అధ్యక్షులుగా పవన్ నియామకం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటిలను సక్రమంగా అమలు చెయ్యాలి.
(హైదరాబాద్ /శుభ తెలంగాణ )శుక్రవారం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులుగా పవన్ ను తెలంగాణ ప్రజాశక్తి పార్టీ పట్టణ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్, ఆధ్వర్యంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బస్వరాజ్ సమక్షంలో నియామక పత్రం అందజేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో బాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను సక్రమంగా అమలు చెయ్యాలని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని,ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాని ఆయన అన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పవన్ మాట్లాడుతూ… పార్టీలో నన్ను గుర్తించి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ కి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బస్వరాజ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవి జిల్లా ఇంఛార్జి బ్రహ్మాజీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రషీద్ రాష్ట్ర కార్యదర్శి వీరేశ్ జిల్లా పట్టణ నాయకులు జగదీష్ ధనరాజ్ భారీ సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.