E-PAPER

నెలవారీ మామూళ్ల దందా.. ఏసీబీకి చిక్కిన ఖాకీ!

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

నెలవారీ మామూళ్ల దందా.. ఏసీబీకి చిక్కిన ఖాకీ!

(నవంబర్ 19 | శుభ తెలంగాణ | హైదరాబాద్ ప్రతినిధి: నరేష్ యాదవ్)
అర్ధరాత్రి వరకు హోటల్‌ నిర్వహణకు రూ.50 వేల డిమాండ్‌.. రూ.20 వేలు తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్‌ పట్టివేత..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి.. వ్యాపార నిర్వహణకు నెలవారీ మామూళ్లు డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో ఏసీబీ వలకు చిక్కారు. టోలిచౌక్‌ ప్రాంతంలో ఓ కేఫెటీరియాను రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునేందుకు, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకు ఆటంకాలు లేకుండా సహకరిస్తానంటూ లంచం కోరిన గోల్కొండ జోన్‌ టోలిచౌక్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే.. టోలిచౌక్‌ పరిధిలోని ఓ కేఫెటీరియా నిర్వాహకులు తమ వ్యాపారాన్ని రాత్రి ఒంటి గంట వరకు కొనసాగించడంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే ఫుడ్‌ ఆర్డర్లను పూర్తి చేసుకునేందుకు పోలీసుల సహకారం కోరినట్లు సమాచారం. ఇదే అదనుగా భావించిన ఇన్‌స్పెక్టర్‌ ప్రతి నెలా రూ.50 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. తొలి నెలకు రూ.40 వేలు ఇవ్వాలని కోరగా, మొదటి విడతగా రూ.20 వేలు చెల్లించేందుకు నిర్వాహకులు అంగీకరించారు.ఇన్‌స్పెక్టర్‌ లంచం డిమాండ్‌పై బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వ్యూహాత్మకంగా వల పన్నారు. పథకం ప్రకారం రూ.20 వేల నగదును తీసుకుంటున్న సమయంలో ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు ఎన్వలప్‌ కవర్లలో రూ.1.80 లక్షల నగదు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న అధికారులపై లంచం ఆరోపణలు రావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :