E-PAPER

తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళి…

SUBHA TELANGANA DIGITAL Reporter
subhatelangana.in

తెలంగాణ అమరవీరులకు సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళి…

(శుభ తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి: కే. నరేష్‌ యాదవ్‌)

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్న సీఎం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారు చేసిన పోరాటం, ప్రాణత్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

అమరవీరుల ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్