హైదరాబాద్, 15 ఆగస్టు,(శుభ తెలంగాణ ప్రతినిధి / కే. నరేష్ యాదవ్)ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉచిత జంతు అంబులెన్స్ సేవలను శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ఘనంగా ప్రారంభించారు.
ప్రమాదాలకు గురైన, అనారోగ్యంతో బాధపడుతున్న మూగజీవాలకు సకాలంలో వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో జంతువులను సురక్షితంగా తరలించి వైద్య సేవలు అందించేందుకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ హనుమంత రావు మేదరమెట్ల, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సాయి యాదవ్, ఆరుద్ర ఫౌండేషన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. జంతు సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న జంతువులకు ఉచిత అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.












